Advertisement

రేపు సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్ర

CM Revanth Reddy Musi yatra from tomorrow
  • హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకోనున్న సీఎం
  • లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి
  • సంగెం నుంచి భీమలింగం వరకు సంకల్ప యాత్ర చేయనున్న సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుంటారు. రేపు (నవంబరు 8) తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

సమీక్ష అనంతరం సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపడతారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
Advertisement
Revanth Reddy
Congress
Telangana
Musi River

More Telugu News