ఎలాన్ మస్క్‌పై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశంసలు

ISRO chief Somanath praises Elon Musk
  • ఎలాన్ మస్క్ కృషి వల్ల అంతరిక్ష రంగం అందర్నీ ఆకర్షిస్తోందన్న సోమనాథ్
  • మస్క్ అద్భుతమైన పని చేస్తున్న గొప్ప వ్యక్తి అన్న ఇస్రో చైర్మన్
  • మస్క్ నుంచి మనమంతా ప్రేరణ పొందామన్న సోమనాథ్
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌పై ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథన్ ప్రశంసలు కురిపించారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సోమనాథ్ మాట్లాడుతూ... ఎలాన్ మస్క్ చేస్తున్న కృషి వల్లే అంతరిక్ష రంగం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోందన్నారు. ఎలాన్ మస్క్ అద్భుతమైన పని చేస్తున్న గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. అంతరిక్ష పరిశోధన కోసం ఎలాన్ మస్క్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

స్పేస్ ఎక్స్ ఇటీవల చాప్‌స్టిక్స్ తరహాలోని మెకానికల్ ఆర్మ్స్‌తో స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్‌ను ఒడిసి పట్టుకోగలిగిందన్నారు. ఇస్రో ఎప్పుడు అలా చేస్తుందని అందరూ అడుగుతున్నారన్నారు. ఇప్పుడు అందరూ మస్క్ వైపు చూస్తున్నారని, అయితే అతనిని మించి విభిన్న ఆలోచనలతో ముందుకు రావడం ఎలా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నట్లు చెప్పారు. మస్క్ పనితీరు నుంచి మనమంతా ప్రేరణ పొందామని, అందుకే అంతరిక్షం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోందన్నారు.
Go Back to Shorts
ISRO
Elon Musk
Tesla
Tech-News

More Telugu News