నన్ను నమ్మి అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు: మంతెన రామరాజు
- ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రామరాజు
- పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా ఏపీఐఐసీని తీర్చిదిద్దుతామని వ్యాఖ్య
- వైసీపీ పాలనలో ఏపీఐఐసీని నిర్వీర్యం చేశారని విమర్శ
వైసీపీ పాలనలో ఏపీఐఐసీని నిర్వీర్యం చేశారని రామరాజు విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వంలో ఏపీఐఐసీని పారిశ్రామికవేత్తలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీఐఐసీ తరపున ప్రతి నియోజకవర్గంలో లేఔట్ తయారుచేసి ముందుకు వెళ్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయ్యేలోగానే అనేక పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని... దానికి అనుగుణంగా మంత్రులందరూ పని చేస్తున్నారని తెలిపారు.