వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో రేవంత్ రెడ్డి భేటీ
- సచివాలయంలో సీఎంతో కేంద్ర బృందం సమావేశం
- వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచన
తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు.
తెలంగాణలో వరద వల్ల జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయానికి నిధులు అందించాలని కోరారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందన్నారు.