చింతపల్లి ఏజెన్సీలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురి గల్లంతు
- ఆంధ్రప్రదేశ్ లోని జీకే వీధి మండలంలో ఘటన
- ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై కూలిన మట్టి, రాళ్లు
- నలుగురిని కాపాడిన గ్రామస్తులు
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులను గ్రామానికి పంపించామని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సీలేరు ఘాట్ రోడ్ లోనూ కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.