మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: కోల్‌కతా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించిన నిర్భయ తల్లి
- మమతా బెనర్జీ తన అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేయాల్సిందన్న నిర్భయ తల్లి
- సీఎంగా ఉండి అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
- నిందితులకు కఠిన శిక్షలు విధించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్య
ఆమె రాష్ట్రానికి అధినేత... హత్యాచార ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ అలా చేయలేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనందుకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ కొరవడిందన్నారు. కొంతమంది మహిళల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఏ స్థాయిలో భద్రత ఉందో కోల్‌కతా హత్యాచార ఘటన మరోసారి రుజువు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించి... నిందితులకు కఠిన శిక్షలు విధించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు.