మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం?: ఉపాసన కొణిదెల
- ఎక్స్ వేదికగా కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉపాసన ఆవేదన
- ఇది మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన అని కామెంట్
- సమాజంలో అనాగరికత కొనసాగుతోందన్న ఉపాసన
- దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని వ్యాఖ్య
దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన.. ఈ రంగంలోని వర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని చెప్పారు. అంతేగాక పలు అధ్యయనాలు మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేల్చాయని గుర్తు చేశారు. మహిళలు మన హెల్త్ రంగానికి చాలా అవసరమని పేర్కొన్నారు.
అందుకే ఎక్కుమంది మహిళలను వర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావడం తన లక్ష్యం అన్నారు. ఈ విభాగంలో వారి అవసరం చాలా ఉందన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ప్రతి మహిళకు భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు.