Telangana: భారతీయుడు 2 సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

 TG government accepts ticket rate hike for Bharateeyudu 2
షార్ట్స్‌లో చూడండి
భారతీయుడు 2 చిత్రం టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 పెంపునకు అనుమతించింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.

అలాగే ఈ వారం రోజుల పాటు థియేటర్‌లలో ఐదో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2ను రూపొందించారు. ఈ సినిమా ఎల్లుండి విడుదల కానుంది.
Go Back to Shorts
Telangana
Bharateeyudu 2
Tollywood
Government

More Telugu News