Swapna Varma: టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న ఆత్మహత్య

Tollywood executive producer Swapna Varma suicide
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తోంది. రాజమండ్రికి చెందిన స్వప్న ఇండస్ట్రీలో స్థిరపడాలని మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ అపార్ట్ మెంట్ లోని 101 ఫ్లాట్ లో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. 

అయితే, గత ఆరు నెలలుగా తనకు ఎలాంటి ప్రాజెక్ట్ రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు సమాచారం. ఈ ఒత్తిడితోనే ఆమె రెండు రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్లాట్ లో ఆమెతో పాటు ఎవరూ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య విషయం బయటకు తెలియరాలేదు. అయితే, బాడీ డీకంపోజ్ కావడం వల్ల చెడు వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా స్వప్న విగతజీవిగా కనిపించింది. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Swapna Varma
Tollywood

More Telugu News