'రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో డ్రగ్స్ కేసులో నిందితురాలు' అంటున్న పోలీసులు

Police reveals about Lavanya who complaints on Raj Tharun
  • రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడి
  • యువతికి బెదిరింపులపై కూడా విచారణ జరుపుతామని వెల్లడి
  • లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారాలపై సాక్ష్యాలు సేకరించి చర్యలు తీసుకుంటామన్న సీఐ
  • అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తామన్న సీఐ
లావణ్య అనే యువతి సినీ నటుడు రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసినట్లు హైదరాబాదు శివారు నార్సింగ్ సీఐ హరికృష్ణ తెలిపారు. అవసరమైతే నటుడు రాజ్ తరుణ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తామన్నారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్లు సీఐ తెలిపారు.

లావణ్య అనే యువతి ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్‌పెక్టర్ మీడియాకు వివరించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. యువతికి బెదిరింపులపై కూడా విచారణ జరుపుతామన్నారు.

లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారాలపై సాక్ష్యాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్ తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల మరో సినీ నటితో అతను సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లు చెప్పారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామన్నారు.
Advertisement
Raj Tharun
Lavanya
Tollywood
Crime News

More Telugu News