Advertisement

బెంగళూరులో కొత్త లుక్ లో కనిపించిన జగన్!

YS Jagan New Look Photos Going Viral In Social Media
  • తెల్లని కుర్తా, నల్లని ప్యాంటులో జగన్ నయా లుక్
  • వారం రోజులుగా బెంగళూరులోనే మాజీ సీఎం
  • అభిమానులను కలుస్తూ ఫొటోలు దిగుతున్న వైసీపీ అధినేత
  • వైరల్ అవుతున్న ఫొటోలపై నెటిజన్ల కామెంట్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కొత్త లుక్‌లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంట్‌లో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న జగన్ అభిమానులను కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తున్న అభిమానులు జగన్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అంతేకాదు, జగన్ శాంతిదూతలా కనిపిస్తున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, జగన్‌ను కలిసేందుకు బెంగళూరులోని ఆయన ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. 

కాగా, జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన తాడేపల్లి చేరుకుంటారు. గత నెల 22న పులివెందుల వెళ్లిన జగన్ 24న అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు.
Advertisement
YS Jagan
YSRCP
Bengaluru
Jagan New Look

More Telugu News