Advertisement

రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. వివాదం ఏంటంటే..!

Rahul Gandhi FIR filed what is the controversy
  • రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఐఆర్‌
  • ఖర్గే కార్యక్రమం జరిగిన ప్రదేశంలో శుద్ధి కార్యక్రమంపై వివాదం
  • రాహుల్‌ వ్యాఖ్యలు కులవివక్షను ప్రోత్సహించాయని ఫిర్యాదు
  • కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలు
  • రాహుల్‌ వ్యాఖ్యలు వాల్మీకి వర్గాన్ని బాధించాయని ఆరోపణ
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. హల్ద్వానీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమం జరిగిన ప్రదేశంలో నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమానికి కులం రంగు పులిమారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

కులాల మధ్య విద్వేషాన్ని పెంచడం, మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటి అభియోగాలపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చారు.

జవహర్‌నగర్‌కు చెందిన అమిత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆయన శ్రీరామ్‌ సేన ధర్మార్థ సేవా న్యాస్‌ సభ్యుడిగా ఉన్నారు. హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధి కార్యక్రమం, పరిశుభ్రత కార్యక్రమం’లో తాను పాల్గొన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వాల్మీకి సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు.

శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వారిని అంటరానితనాన్ని పాటించే వారిగా, దళిత వ్యతిరేకులుగా రాహుల్‌ చిత్రీకరించారని అమిత్‌కుమార్‌ ఆరోపించారు. తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీలతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. దీనికి ఖర్గే కులానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఆగస్టు 8న ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు. ఆగస్టు 11న అదే ప్రదేశంలో కొందరు ‘శుద్ధి యజ్ఞం’ నిర్వహించడంతో వివాదం మొదలైంది. ఈ ఘటనను కాంగ్రెస్‌ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనంగా విమర్శించింది. సభ తర్వాత ప్రదేశం చెత్తతో నిండిపోయిందని, మతపరమైన ప్రదేశంలో అభ్యంతరకర నినాదాలు చేశారని బీజేపీ సమర్థించింది.

ఆగస్టు 29న రాహుల్‌ గాంధీ ఈ ఘటనపై స్పందిస్తూ.. శుద్ధి కార్యక్రమానికి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
Advertisement
Rahul Gandhi
Uttarakhand FIR
Mallikarjun Kharge
Caste discrimination controversy
SC ST Act case
Haldwani Shuddhi Yagya

More Telugu News