హైదరాబాద్‌లో కానిస్టేబుల్ బలవన్మరణం.. లవ్ ఫెయిల్యూరే కారణమా?
- హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ నిభాష్ ఆత్మహత్య
- ప్రేమ విఫలమవడంతోనే బలవన్మరణం అని అనుమానం
- ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్ సందేశం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తిరుమలనగర్‌లో నివసించే నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని భావించిన నిభాష్‌కు యువతి కుటుంబ సభ్యుల నుంచి నిరాకరణ ఎదురైంది. వారు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో నిభాష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే రాత్రి తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్య చేసుకునే ముందు ఈ విషయాన్ని తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. ఉదయం అతని స్నేహితులు ఇంటికి వచ్చి చూడగా, నిభాష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.