వినాయక చవితి వేళ భక్తులకు చిరంజీవి కీలక పిలుపు..!
- సీడ్ గణేశుడిని పూజించాలని చిరంజీవి పిలుపు
- మట్టి వినాయకులతో పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడి
- ఇంట్లోనే నిమజ్జనం చేసి మొక్కలు పెంచాలని సూచన
- సీడ్ గణేశుడి ప్రతిమలను ఆవిష్కరించిన చిరంజీవి
- కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ కుమార్
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించిన తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. ఆ విత్తనాల నుంచి మొక్కలు పెరిగి భవిష్యత్తులో మనల్ని ఆశీర్వదిస్తాయని తెలిపారు.
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ రూపొందించిన సీడ్ గణేశుడి ప్రతిమలను చిరంజీవి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి సంతోష్ కుమార్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే లక్షల మందిని ప్రోత్సహించి 20 కోట్ల మొక్కలు నాటేలా చేయడం అభినందనీయమన్నారు. పచ్చదనం పెంపు కోసం ఆయన చేస్తున్న కృషికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.