ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్ కంట ఆనంద భాష్పాలు

Rohit Sharma In Tears After T20 World Cup 2024 Triumph
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్ సాధించిన అనంతరం టీమిండియా సారథి రోహిత్‌శర్మ కంటనీరు పెట్టుకున్నాడు. విజయం అనంతరం భార్య రితికా సజ్దే.. రోహిత్‌ను అల్లుకుపోయింది. దీంతో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయిన రోహిత్ కంట కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మధుర క్షణాలకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ టోర్నీలో రోహిత్ అద్భుత ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించాడు. 36.71 సగటు, 156.70 స్ట్రైక్‌రేట్‌తో 257 పరుగులు చేశాడు. అయితే, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
Go Back to Shorts
Rohit Sharma
Rohit Sharma Tears
Team India

More Telugu News