బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్.. స్పెషల్ ట్వీట్!
Add ap7am to your home Screen

బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్.. స్పెషల్ ట్వీట్!

Chandrababu Naidu Tweet on Balakrishna Birthday
  • నేడు బాలకృష్ణ 64వ‌ పుట్టినరోజు
  • ఎక్స్ వేదిక‌గా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్ర‌బాబు
  • అన్‌స్టాపబుల్ హీరో అంటూ తనదైన శైలిలో పొగడ్తలు కురిపిస్తూ ట్వీట్‌
టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ తన 64వ‌ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు విభిన్న రీతుల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదే క్రమంలో బాలకృష్ణ బావ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న పాత్రల్లో న‌టిస్తూ తెలుగు సినిమా రంగంలో అన్‌స్టాపబుల్ హీరో అనిపించుకున్న అగ్ర‌హీరో అంటూ బాలయ్యపై చంద్రబాబు ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదిక‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు. తిరుగులేని ప్రజాద‌ర‌ణ‌తో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.

"తెలుగు సినిమా రంగంలో అన్ స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో.. హిందూపురం శాసనసభ్యులు.. నా ఆత్మీయుడు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినీ, రాజకీయ రంగాలలో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్ళూ ఆనంద, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ బాలయ్య పుట్టినరోజున ఆయనపై అభిమానాన్ని చంద్రబాబు ఎక్స్‌లో పంచుకున్నారు.

ఇక టీడీపీ అధినేత‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పలువురు అభిమానులు గతంలో చంద్రబాబుతో బాలయ్య దిగిన ఫొటోల్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే నారా లోకేశ్ కూడా బాల‌కృష్ణ‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. 'నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Chandrababu
Balakrishna
Birthday
Andhra Pradesh

More Telugu News