అమాన‌వీయం.. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన త‌ల్లి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమాన‌వీయం.. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన త‌ల్లి!

Woman throws speech disabled child into crocodile infested river in Karnataka
  • క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ఘ‌ట‌న
  • పుట్టు మూగ కొడుకు విష‌య‌మై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌
  • ఇదే విష‌య‌మై ఇటీవ‌ల మ‌రోసారి దంప‌తుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
  • విసుగెత్తిన త‌ల్లి మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన వైనం
క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డిన భార్య మూగ‌వాడైన ఆరేళ్ల కుమారుడిని మొస‌ళ్లు ఉండే న‌దిలో విసిరేసింది. దాంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ర‌వి కుమార్, సావిత్రి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కొడుకు పుట్టు మూగ‌. దాంతో ఆ పిల్లాడి విష‌య‌మై సావిత్రితో భ‌ర్త త‌ర‌చూ గొడ‌వ ప‌డేవాడు. 

ఎందుకు అలా మూగ‌వాడికి జ‌న్మ‌నిచ్చావంటూ, ఆ పిల్లవాడిని ఎక్క‌డైనా వ‌దిలేసి రావాల‌ని భార్య‌తో ర‌వి కుమార్‌ మూర్ఖంగా ఘ‌ర్ష‌ణ‌ప‌డేవాడు. ఇదే విష‌య‌మై శ‌నివారం సాయంత్రం మ‌రోసారి వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. భ‌ర్త గొడ‌వ‌ల‌తో విసుగెత్తిపోయిన‌ సావిత్రి మూగ కొడుకును తీసుకెళ్లి మొస‌ళ్లు ఉండే కాళి న‌దిలో విసిరేసింది. సావిత్రి త‌న కుమారుడిని న‌దిలో విసిరేయ‌డం చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో బాలుడి కోసం వెతికించారు. 

కానీ, అప్ప‌టికే చీక‌టి ప‌డ‌డంతో బాలుడు దొర‌క‌లేదు. ఆదివారం ఉద‌యం బాలుడి మృత‌దేహాన్ని పోలీసులు వెలికితీశారు. పిల్లాడి శ‌రీరంపై గాయాలు ఉండ‌డంతో పాటు ఒక చేయి కూడా లేక‌పోవ‌డంతో మొస‌ళ్లు దాడి చేసి ఉంటాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అనంత‌రం బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రినీ అదుపులోకి తీసుకున్న దండేలి రూర‌ల్ పోలీసులు వారిపై సెక్ష‌న్ 109, 302 కింద కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు.
Advertisement
Karnataka
Kali River
Crocodile
Crime News

More Telugu News