భార్యతో కలిసి ముంబైలో డిన్నర్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్
- 'వార్ 2' షూటింగ్ కోసం ముంబై వెళ్లిన తారక్
- బాంద్రాలో డిన్నర్ పార్టీకి హాజరైన తారక్, ప్రణతి
- పార్టీకి హాజరైన అలియా, రణబీర్, హృతిక్, కరణ్ జొహార్
తాజాగా 'వార్ 2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసిన ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లాడు. ఈ పార్టీకి తారక్ భార్య ప్రణతి కూడా హాజరయింది. రణబీర్ కపూర్, అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జొహార్ వంటి సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వీరు బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఎన్టీఆర్, ప్రణతి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.