Advertisement

నీట్ వివాదం, సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై స్పందించిన సల్మాన్ ఖాన్

Salman Khan responds to NEET controversy and Sonam Wangchuk fast
  • ఆమరణ దీక్ష విరమించాలని సోనమ్ వాంగ్‌చుక్‌కు సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి
  • చదువులు కొనసాగిస్తూనే శాంతియుతంగా నిరసన తెలపాలని విద్యార్థులకు సూచన
  • నీట్-యూజీ 2026 అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నీట్ పేపర్ లీకేజి వివాదంపై స్పందించారు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ తన దీక్షను విరమించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో, ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థులు తమ నిరసనలను శాంతియుతంగా కొనసాగిస్తూనే, చదువులపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

నీట్-యూజీ 2026 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగా వాంగ్‌చుక్ చేపట్టిన దీక్ష ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యువత ఆకాంక్షలను, వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, అయితే చర్చలు, అహింసా మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతకాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
Advertisement
Salman Khan
Sonam Wangchuk
NEET controversy
Student protests
Dharmendra Pradhan

More Telugu News