హెలికాప్టర్ లో సీట్లో కూర్చోబోయి కింద పడిపోయిన మమతా బెనర్జీ.. వీడియో ఇదిగో

Mamata Banerjee Falls While Boarding Helicopter
  • ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మమతా బెనర్జీ
  • హెలికాప్టర్ సీట్లో కూర్చునే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయిన మమత 
  • మమతకు గాయాలైనట్టు సమాచారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు దుర్గాపూర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 అనంతరం అసన్ సోల్ సభలో పాల్గొనేందుకు ఆమె హెలికాప్టర్ ఎక్కారు. అయితే, హెలికాప్టర్ లో సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయారు. సీట్లో కూర్చోబోయి కిందపడిపోయారు. వెంటనే ఆమె భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఆమె గాయపడినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

గత నెల మార్చి 14న ఆమె తన నివాసంలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆమె తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. గాయాలకు వైద్యులు కుట్లు వేశారు.
Advertisement
Mamata Banerjee
Helicopter
Slip

More Telugu News