కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో చుక్కెదురు
- ఆస్తుల అటాచ్ సబబేనన్న పీఎంఎల్ఏ అథారిటీ
- మనీలాండరింగ్ కేసులో రూ.752 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
- దీనిపై న్యాయపోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు..
స్వాతంత్య్రానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. నష్టాల కారణంగా ఈ పత్రిక 2008 లో మూతపడింది. కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ రూ.90 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో పాటు సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగపరిచిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ నష్టాల్లో కూరుకుపోయింది. యంగ్ ఇండియన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సోనియా, రాహుల్ ఉండడం గమనార్హం. ఈ కంపెనీని 2010లో ఏజీఎల్ కొనుగోలు చేసింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారాల్లో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. గతేడాది నేషనల్ హెరాల్డ్ కు చెందిన పలు ఆస్తులను జఫ్తు చేసింది.