నా రాజకీయ గురువు చంద్రబాబు.. నాకు దైవంతో సమానం: సుజనా చౌదరి
- జాతీయ పార్టీలో చేరాలన్న కోరికతోనే బీజేపీలోకి వెళ్లానన్న సుజనా చౌదరి
- ఎప్పటికీ తన రాజకీయ గురువు చంద్రబాబేనని వ్యాఖ్య
- ఏపీ ప్రజల కోసం పవన్ త్యాగమూర్తిలా మారారని కితాబు
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారని సుజనా చౌదరి కొనియాడారు. ఏపీ ప్రజల కోసం ఆయన త్యాగమూర్తిలా మారారని చెప్పారు. సొంత అన్నయ్య నాగబాబు టికెట్ ను కూడా పొత్తు కోసం త్యాగం చేశారని అన్నారు.
మరోవైపు, పవన్ కల్యాణ్ పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ... మహేశ్ ఏం మాట్లాడినా ఎవరూ స్పందించవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. ఆయన స్థాయికి మనం వెళ్లొద్దని, ఆయనను దుర్భాషలాడొద్దని, మన గ్రాఫ్ పెంచుకుంటూ పోదామని అన్నారు. విజయవాడ భవానీపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన మూడు పార్టీల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.