Botsa Satyanarayana: చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు: బొత్స సత్యనారాయణ

Even God can not forgive Chandrababu says Botsa Satyanarayana
షార్ట్స్‌లో చూడండి
పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని... ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడు అని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండొద్దా అని అడిగారు. చేసిందంతా చేసి... ఇప్పుడు నంగనాచి కబుర్లు చెపుతున్నారని దుయ్యబట్టారు. తన నియోజకవర్గంలో మూడు అక్షరాల గంటా పోయి రెండక్షరాల కళా వచ్చారని.. అంతకు మించిన మార్పు లేదని అన్నారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News