Kasthuru: ఓ హీరో వలన నన్ను రెండు సినిమాల్లో నుంచి తీసేశారు: సీనియర్ హీరోయిన్ కస్తూరి

Kasthuri Interview
షార్ట్స్‌లో చూడండి
1990లో కథానాయికగా కస్తూరి తన జోరును చూపించారు. తెలుగు ... తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆమె చాలా సినిమాలలో సందడి చేశారు. ఆ తరువాత ఆమె ఒక వైపున కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే, మరో వైపున సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 

ఒక ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ .. " ఓ హీరోతో నేను మూడు సినిమాలు చేయవలసి ఉంది. మొదటి సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే అతను నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అతను తన లిమిట్స్ దాటడం పట్ల నేను అసహనాన్ని వ్యక్తం చేశాను. ఆ కారణంగా ఆయన మిగతా రెండు సినిమాలలో నుంచి నన్ను తీసేయించారు" అని అన్నారు. 

" మిగతా రెండు సినిమాలలో నుంచి తప్పించడం వలన నేనేం బాధపడలేదు. అది కూడా మంచికే జరిగిందని అనుకున్నాను. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ .. పైకి నవ్వుతూ పలకరిస్తూ  నటించడం నా వల్ల కాదు" అని చెప్పారు. దాంతో ఆ హీరో ఎవరై ఉంటారా అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 
Go Back to Shorts
Kasthuru
Actress
Intinti Gruhalakshmi

More Telugu News