సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి 'మహారాణి' సీజన్ 3!

Maharani 3 Steaming date confirmed
  • టాప్ సిరీస్ లలో ఒకటిగా 'మహారాణి'
  • రాణి భారతిగా మెప్పించిన హుమా ఖురేషి 
  • మార్చి 8వ తేదీ నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్     
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల పై ఇప్పుడు విపరీతమైన పోటీ కనిపిస్తోంది. జనం మెచ్చే కంటెంట్ ను అందించడం కోసం అవి అన్ని వైపులా పరుగులు పెడుతున్నాయి. అందుకోసం భారీ సిరీస్ లను బరిలోకి దించుతున్నాయి. అలా సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన వెబ్ సిరీస్ గా 'మహారాణి' కనిపిస్తుంది. హుమా ఖురేషి ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. 

ఈ వెబ్ సిరీస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. 1990లలో బీహార్ రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇంతవరకూ వచ్చిన సీజన్ 1 .. సీజన్ 2కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు సీజన్ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సిరీస్ లో రాణి భారతిగా హుమా ఖురేషి కనిపించనుంది. సీజన్ 2లో ఆమె జైలుకు వెళుతుంది. జైలు నుంచి బయటికి వచ్చిన ఆమె ఏం చేస్తుంది? తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి పథకాలు వేస్తుంది? అనేది కథ.  సౌరభ్ భావే దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 
Go Back to Shorts
Maharani 3
Huma Quereshi
Actress
Sourabh Bhave

More Telugu News