అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో తెలుగులో మాట్లాడుకున్న ఇద్దరు క్రికెటర్లు... వీడియో వైరల్
- నిన్న దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్
- ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్
- భారత జట్టులో ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లు
- మ్యాచ్ సందర్భంగా తెలుగులో మాట్లాడుకున్న వైనం
భారత జట్టు వికెట్ కీపర్ అవనీశ్ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ ఇద్దరూ హైదరాబాద్ వాళ్లే. అభిషేక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల ఉన్న అవనీశ్ రావు అతడికి తెలుగులో సూచనలు చేయడం వినిపించింది. ఈ వీడియోను మ్యాచ్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.