Gaami: అఘోరగా విష్వక్సేన్ .. 'గామి' రిలీజ్ డేట్ ఖరారు!

  • విష్వక్సేన్ కథానాయకుడిగా 'గామి'
  • అఘోర పాత్రలో కనిపించనున్న హీరో 
  • కీలకమైన పాత్రలో చాందినీ చౌదరి 
  • మార్చి 8వ తేదీన సినిమా విడుదల  

Gaami Release date confirmed

విష్వక్సేన్ ఇంతవరకూ ఎక్కువగా మాస్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఏం చేసినా మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. ఈ సారి మాత్రం ఆయన కొత్తదనం కోసం ట్రై చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే తాజాగా ఆయన నుంచి రానున్న 'గామి' సినిమా. 

ఈ సినిమాలో విష్వక్సేన్ అఘోరగా కనిపించనున్నాడు. ఆయన పాత్ర పూర్తి భిన్నంగా తెరపై కనిపించనుంది. తన బాడీ లాంగ్వేజ్ కి దూరంగా.. తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రను ఆయన పోషించడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

కీలకమైన పాత్రలో చాందినీ చౌదరి కనిపించనుంది. ఈ సినిమా చిత్రీకరణ కాశీలోను .. హిమాలయాలలోను చేసినట్టుగా విష్వక్ చెప్పాడు. దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నాడు. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News