ఒక్కో సినిమాకు రూ.4 కోట్లా?.. తన పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

Rashmika Mandanna reacts to claims of charging Rs 4 crore per film
  • ‘యానిమల్’ విజయంతో పారితోషికం పెంచిందంటూ వార్తలు
  • ఇదంతా చూస్తుంటే పారితోషికం పెంచాలనిపిస్తోందని వ్యాఖ్య
  • ఎందుకు పెంచారని నిర్మాతలు అడిగితే మీడియా పేరే చెబుతానంటూ చమత్కారం 
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతోంది. పుష్ప, యానిమల్ మూవీ విజయాలతో తనకు ప్రస్తుతానికి తిరుగేలేదని నిరూపించుకుంది. ఇక పుష్ప-2 కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘యానిమల్’ తరువాత రష్మిక తన రెమ్యూనరేషన్‌‌ను భారీగా పెంచేసిందన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోందంటూ పలు సైట్లలో వార్తలు వెలువడ్డాయి. 

సినీ వర్గాల్లో ఈ వార్త పెద్ద చర్చకే దారి తీయడంతో రష్మిక ఎట్టకేలకు స్పందించింది. వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రెమ్యూనరేషన్ పెంచానా? ఇలా అని ఎవరు అంటున్నారో? ఈ వార్తలు చూస్తుంటే నాకూ అలాగే చేయాలనిపిస్తోంది. పారితోషికం ఎందుకు పెంచారని నిర్మాతలు అడిగితే మీడియా అలా అంటోంది సార్ అని సమాధానమిస్తా. వాళ్ల అంచనాలను అందుకోవడం మినహా నేనింక చేసేదేముంది’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది రష్మిక. 

ఇక, ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ రూ.900 కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సినిమాపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల పాత్ర చిత్రీకరణ, హింసపై సినీ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సహా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మికతో పాటూ త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ముఖ్యపాత్రలు పోషించారు.
Advertisement
Rashmika Remuneration
Rashmika Mandanna
Bollywood

More Telugu News