లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో 1100 కేజీల కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు

లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో 1100 కేజీల కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు

TDP leaders cut 1100 kg huge cake on Nara Lokesh birthday
  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • భారీ కేక్ తెప్పించిన లోకేశ్ వీరాభిమాని కొమ్మారెడ్డి
  • విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ఈ 1100 కేజీల కేక్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. లోకేశ్ వీరాభిమాని కొమ్మారెడ్డి ఈ 1100 కేజీల భారీ బర్త్ డే కేక్ ను సిద్ధం చేశారు. టీడీపీ అగ్రనేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కాల్వ శ్రీనివాసులు ఈ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు తదితర టీడీపీ సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. విజయవాడలో ఈ కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక మంది ఈ కేక్ ను సందర్శించారు. దీనిపై మన మంగళగిరి-మన లోకేశ్ అని రాశారు.
Advertisement
Nara Lokesh
Cake
Birthday
Vijayawada
Kommareddy
TDP
Andhra Pradesh

More Telugu News