నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ, నా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు: చంద్రబాబు ట్వీట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- ప్రజల మద్దతుతో 2024 ఎన్నికల్లో నిజం గెలిచిందన్న టీడీసీ అధినేత
- రాష్ట్రవ్యాప్తంగా 'నిజం గెలిచింది' పేరుతో కార్యక్రమాల నిర్వహణ
- తెలుగు జాతిని నంబర్ 1 చేయడమే తన లక్ష్యమని పునరుద్ఘాటన
"ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట నిలబడతారు, నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదే నా నమ్మకం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు అన్నారు. మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అరెస్టు చేసిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనాటి పరిణామం తనలో విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏ తప్పు చేయని తనను కుట్రపూరితంగా అరెస్టు చేసి, 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ, నా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు, లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు" అని ఆయన తెలిపారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కోసం నిలబడిన తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు చూపిన సంఘీభావం తన జీవితంలో మరువలేనిదని అన్నారు. తనను నిర్బంధించినా, దేశ విదేశాల్లో తన కోసం ప్రజలు ఎత్తిన గొంతును నొక్కలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతును మరింత బలంగా చాటారని చంద్రబాబు అన్నారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి, నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా 'నిజం గెలిచింది' పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని బలపరిచిందని వివరించారు.
ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరి సహకారంతో తెలుగు జాతిని నంబర్ 1 చేయాలనే తన కలను నిజం చేసి తీరుతానని చంద్రబాబు మాట ఇచ్చారు.