తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు

తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు

Thammineni Veerabhadram health bulletin
  • గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పిన వైద్యులు
  • మ‌ందులతో చికిత్స అందిస్తున్నామని వెల్లడి 
  • తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపిన డాక్టర్లు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులు మంగళవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వెంటిలేటర్ సహాయంతో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారన్నారు. తమ్మినేనికి మందుల‌తో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

 ఖమ్మంలోని తన నివాసంలో ఉన్న సమయంలో తమ్మినేనికి ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి... ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
thammineni
Telangana
communist

More Telugu News