Chandrababu: చంద్రబాబుకు భారీ ఊరట... ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు

Chandrababu gets anticipatory bail in three cases
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు  (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్ కు కూడా బెయిల్ మంజూరైంది.
Go Back to Shorts
Chandrababu
Anticipatory Bail
Liquor Case
Inner Ring Road Case
Sand Policy Case
AP High Court
TDP
Andhra Pradesh

More Telugu News