సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
- రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికపూడి
- వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని వ్యాఖ్య
- ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్మ
కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాసరావు... వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, శ్రీనివాసరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.