బీసీల పట్ల చంద్రబాబుది సవతి ప్రేమ: గోరంట్ల మాధవ్
- స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత
- బీసీలను ప్రభుత్వం దారుణంగా వంచించిందన్న గోరంట్ల మాధవ్
- చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలని డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోలను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ పరిణామంపై వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను దారుణంగా వంచించిందని ఆయన ఆరోపించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. బీసీల పట్ల చంద్రబాబుది సవతి ప్రేమ అని, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, వైసీపీయే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయని గుర్తుచేస్తున్నారు. తాజా తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 34 శాతం సీట్లను బీసీలకే కేటాయిస్తామని ప్రకటించారు.