కొవిడ్‌తో అంతగా భయం లేదు కానీ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి: ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
- కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన అవసరం లేదన్న సూపరింటెండెంట్
- బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు జెన్.1 సోకే అవకాశాలు ఎక్కువ అని స్పష్టీకరణ
- కొవిడ్ రూపాంతరం చెంది జెన్.1గా మారిందని వెల్లడి
నిన్న బుధవారం ఫీవర్ ఆసుపత్రికి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే అది జెన్.1 అవునా? కాదా? అనే విషయమై తేలాల్సి ఉందని, ఈ నివేదికలను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. జెన్.1 ఎక్కువగా వ్యాప్తి చెందితే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.