Ram Gopal Varma: జనసేన పార్టీ తన పేరును ఆ విధంగా మార్చుకుంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు: రాంగోపాల్ వర్మ
జనసేనాని పవన్ కల్యాణ్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు సందర్భాల్లో విమర్శిస్తుండడం తెలిసిందే. తాజాగా వర్మ జనసేన పార్టీపై స్పందించారు. "నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది. జనసేన పార్టీ తన పేరును చంద్రసేన పార్టీగా మార్చుకోవాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు" అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఏపీలో జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు కారణంగా, ఇవాళ యువగళం విజయోత్సవ సభకు కూడా పవన్ హాజరవుతున్నారు. ఈ సభకు చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తదితర టీడీపీ అగ్రనేతలందరూ హాజరవుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలతో కలిసి ఒకే వేదిక పంచుకోనుండడం పవన్ కు ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.