అప్రూవర్ గా మారిన తర్వాత ఇబ్బందులు పెరిగాయి: దస్తగిరి భార్య

అప్రూవర్ గా మారిన తర్వాత ఇబ్బందులు పెరిగాయి: దస్తగిరి భార్య

Dastagiri wife Shabana talks to media
  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి
  • వివేకా హత్య కేసులో బెయిల్... మరో కేసులో అరెస్ట్
  • ప్రస్తుతం కడప జైల్లో ఉన్న దస్తగిరి
  •  జైల్లో దస్తగిరిని కలిసిన భార్య షబానా
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారడంతో అతడికి బెయిల్ లభించింది. 

అయితే ఓ ప్రేమ జంటను బెదిరించారన్న ఆరోపణలతో అతడిపై కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. దస్తగిరిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం దస్తగిరి కడప జైల్లో ఉన్నాడు. ఇవాళ దస్తగిరి భార్య షబానా కడప జైలు వద్దకు వచ్చింది. దస్తగిరిని జైల్లో కలిసిని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. 

తన భర్త దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో రాజీకి రావాలని వైసీపీ నేతలు చెబుతున్నారని, వారి ప్రయత్నాలు కుదరకపోవడంతో తన భర్తను ఇబ్బంది పెడుతున్నారని వివరించింది. తన భర్త దస్తగిరికి బెయిల్ రాకుండా పోలీసులు, వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తమ కుటుంబానికి ఏం జరిగినా అందుకు వైసీపీ నేతలు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని షబానా స్పష్టం చేసింది.
Advertisement
Dastagiri
Shabana
Kadapa Jail
YS Vivekananda Reddy
YSRCP

More Telugu News