శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. దర్శన సమయం గంట పొడిగింపు

Good News For Sabarimala Ayyappa Devotees
  • భక్తులతో కిక్కిరిసిపోతున్న శబరిమల
  • రెండోభాగంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి దర్శనాలు
  • ఇకపై మూడు గంటల నుంచే దర్శనాలు ప్రారంభం
శబరిమల అయ్యప్పస్వామి దర్శన సమయాన్ని అదనంగా గంట పొడిగిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతుండడంతో కొండలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు వీలైనంత త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా రోజులో రెండో భాగంలో దర్శన సమయాన్ని పెంచారు. 

సాధారణంగా రోజులో రెండోభాగంలో సాయంత్రం 4 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. ఇప్పుడు దీనిని సాయంత్రం నాలుగు గంటలకు బదులు 3 గంటలకు తగ్గించారు. ఫలితంగా దర్శన సమయం గంట పెరిగింది. ఇక నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు రెండోదశ దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
Advertisement
Sabarimala
Lord Ayyappa
Ayyappa Devotees
Kerala

More Telugu News