Revanth Reddy: మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to go Delhi over cabinet berths
షార్ట్స్‌లో చూడండి
మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు ఢిల్లీకి చేరుకొని, మంత్రివర్గ కూర్పుపై చర్చించి, తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఆరుగురికి ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై కూడా చర్చించనున్నారు. ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Assembly Results
Congress
Minister

More Telugu News