బంగ్లాదేశ్ బ్యాటర్ సెల్ఫ్ అవుట్.. టెస్ట్‌ల చరిత్రలో తొలి ఘటన
- న్యూజిలాండ్‌తో మీర్పుర్ వేదికగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఘటన
- జేమిసన్ వేసిన బంతి తన బ్యాట్‌కు తగిలాక చేతితో అడ్డుకున్న బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్
- అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూల్ ప్రకారం అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
గతంలో ఇలాంటి ఘటనలను హ్యాండ్లింగ్ ద బాల్ నిబంధన కింద పరిగణించేవారు. అయితే, ఈ చర్య కూడా అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ నిబంధనల కిందే పరిగణించాలన్న భావనతో 2017లో ఈ మేరకు మార్పులు చేశారు. నిబంధనల్లో సరళత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తలపడుతున్న బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్టులో ప్రత్యర్థిని మట్టికరిపించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో కూడా న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది.