బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుంది: యోగి ఆదిత్యనాథ్
- బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని వ్యాఖ్య
- తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన
- డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే... నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేశారని, కుటుంబ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.