బీటెక్ రవిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ కొట్టివేత
- ఈ నెల 14న బీటెక్ రవి అరెస్ట్
- ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు
- తిరస్కరించిన కడప కోర్టు
- బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా
కాగా, బీటెక్ రవి కేసులో పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. ఆయనను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. బీటెక్ రవిని 5 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చింది. బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పైనా న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.