అనంతపురం ఎస్పీని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy met Anantapur SP Anburajan
  • కడప జిల్లా నుంచి బదిలీపై అనంతపురం జిల్లాకు వచ్చిన ఎస్పీ అన్బురాజన్
  • అన్బురాజన్ తో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ
  • ఓట్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడి
  • ఎవరైనా తప్పు చేస్తే ఎంతవరకైనా వెళ్లి పోరాడతానని స్పష్టీకరణ
ఎస్పీ అన్బురాజన్ కొన్ని నెలల కిందట కడప జిల్లా నుంచి బదిలీపై అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలో, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. 

నేడు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎల్లనూరు, పుట్లూరు తహసీల్దార్లు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేవారిని తాను ఉపేక్షించబోనని జేసీ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలు తమకు జీవన్మరణ పోరాటం అని పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఎంతవరకైనా వెళ్లి పోరాడతానని తెలిపారు.
Advertisement
JC Prabhakar Reddy
SP Anburajan
Anantapur District
Deepavali Wishes
TDP

More Telugu News