Advertisement

ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ

BJP releases fourth list of mla candidates
  • ఫోన్ చేసి అభ్యర్థులకు సమాచారం అందించిన పార్టీ నేతలు
  • నాలుగు విడతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్‌కు టిక్కెట్ కేటాయింపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఖరారైన అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. మొత్తం నాలుగు విడతల్లో వంద స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 8 సీట్లు కేటాయించింది. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. మరో పదకొండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. నేడు ఖరారైన జాబితాలో... కంటోన్మెంట్ - కృష్ణప్రసాద్, నాంపల్లి - రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్, మేడ్చల్ - రామచంద్ర రావు, పెద్దపల్లి - ప్రదీప్ కుమార్, సంగారెడ్డి - పులిమామిడి రాజుకు కేటాయించారు.
Advertisement
BJP
Telangana Assembly Election
Telangana

More Telugu News