రూ.50 లక్షల నగదుతో దొరికిన మహాత్ముడు నాపై పోటీ చేస్తాడంట: రేవంత్ రెడ్డిపై కేసీఆర్
- కామారెడ్డిలో ఎవరికి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచన
- కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అని ఉద్యమించాక తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్
- కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సదస్సులో కేసీఆర్
తెలంగాణను ప్రకటించేందుకు కాంగ్రెస్ పలుమార్లు మోసం చేసిందన్నారు. ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అవుతాయని భావించి అప్పుడు తెలంగాణ ప్రకటన చేశారని, ఇదీ కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా బతకనీయొద్దని, దీన్ని ముందల పడనీయద్దని, రాజకీయ అస్థిరత తేవాలని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారన్నారు. కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మహానుభావుడే ఇప్పుడు తనపై పోటీ అంటున్నాడని మండిపడ్డారు.