పాకిస్థాన్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న న్యూజిలాండ్.. భారీ స్కోరు దిశగా కివీస్
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- సెంచరీతో విరుచుకు పడిన రచిన్ రవీంద్ర
- కివీస్ స్కోరు.. 43 ఓవర్లలో 337/4
ఈ క్రమంలో రవీంద్ర 94 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విలియంసన్ 95 పరుగుల వద్ద ఔటై శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రవీంద్ర 108 వ్యక్తిగత పరుగుల వద్ద బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఆ తర్వాత మిషెల్ కూడా దూకుడుగా 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం చాప్ మన్ (29), ఫిలిప్స్ (12) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగులు. కివీస్ దూకుడు చూస్తుంటే భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.