కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

 Raja Shyamala Yagam completed today
  • ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల సహిత సుబ్రమణ్యేశ్వర స్వామి యాగం చేపట్టిన కేసీఆర్
  • శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు కొనసాగిన యాగం
  • మహా పూర్ణాహుతితో నేడు ముగిసిన యాగ క్రతువు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రమణ్యేశ్వరస్వామి యాగం ముగిసింది. విశాఖ శ్రీ శారదా పీఠం వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించింది. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకరణలో దర్శనమిచ్చారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించినట్లు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నారన్నారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేశామన్నారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందన్నారు. మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్‌ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దారు.
Go Back to Shorts
KCR
yagam
Telangana Assembly Election
BRS

More Telugu News