Chandrababu: చంద్రబాబు పీటీ వారెంట్... ఏసీబీ కోర్టు నిర్ణయం 20కి వాయిదా

ACB court to decide pt warrant on chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంతో కోర్టు నిర్ణయం వాయిదా పడింది.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోగా టీడీపీ అధినేతను అరెస్ట్ చేయవద్దని కూడా సీఐడీ తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Chandrababu
acb court
Andhra Pradesh
Supreme Court

More Telugu News