ఎన్నికల్లో మద్దతు కోరిన కిషన్ రెడ్డి.. చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్
- పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం
- తెలంగాణ అసెంబ్లీలో మద్దతివ్వాలని అడిగిన బీజేపీ నేతలు
- జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను జనసేనాని మద్దతు కోరిన బీజేపీ
జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దగ్గరైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.