'టీడీపీలో మరో వజ్రం అయ్యన్న' అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యం!

Ram Gopal Varma tweet TDP leader Ayyanna Patrudu
  • నారా బ్రాహ్మణి పేరును మరిచిపోయిన అయ్యన్నపాత్రుడి వీడియో ట్వీట్
  • బండారు సత్యనారాయణ తర్వాత అయ్యన్న మరో జెమ్ అంటూ ట్వీట్
  • అంతకుముందు బండారును అరెస్ట్ చేసినందుకు అభినందన
తెలుగుదేశం పార్టీపై నిత్యం తనదైన శైలిలో చురకలు అంటించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో టీడీపీ నేతపై ఓ ట్వీట్ చేశారు. టీడీపీలో బండారు సత్యనారాయణ తర్వాత మరో రత్నం అయ్యన్నపాత్రుడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నారా బ్రాహ్మణి పేరును అయ్యన్న మరిచిపోయిన వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా షేర్ చేశారు. బండారు తర్వాత నారా బ్రాహ్మణిపై మాట్లాడిన మరో టీడీపీ జెమ్ అయ్యన్న అని పేర్కొన్నారు.  

ఇక, వర్మ షేర్ చేసిన వీడియో ప్రకారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ నారా బ్రాహ్మణి పేరును మరిచిపోయారు. అయ్యన్న మాట్లాడుతూ... చంద్రబాబు కోడలు, బాలకృష్ణ రెండో కూతురు.. అంటుండగా, అంతలో పక్కన ఉన్న వారు 'మొదటి కూతురు' అని చెప్పగానే.. ఆమె పేరు ఏమిటి? అని అడిగి, పక్కనున్న వారు పేరు చెప్పగానే... 'నారా బ్రాహ్మణిని ముందు పెట్టి యువగళం పాదయాత్రను పూర్తి చేస్తా'మన్నారు.  

బండారు అరెస్ట్‌పై ట్వీట్

పర్యాటక శాఖ మంత్రి రోజా మీద తీవ్రవ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకున్నందున పౌరులమైన తాము అభినందిస్తున్నామని పేర్కొన్నారు.
Advertisement
Ram Gopal Varma
Nara Brahmani
Ayyanna Patrudu
Twitter

More Telugu News